'ప్రేమమ్ ' కి అదో ప్లస్
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'.. తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'కార్తికేయ' ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై నెలలో విడుదలయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. రెండో సినిమా చేసే వారికి నాగచైతన్య ఇటీవల కాలంలో ఓ ఆప్షన్ గా మారుతున్నాడు. ఆ విధంగా చూస్తే చందు నాలుగో దర్శకుడు. ఇప్పటికే ఈ లిస్ట్‌లో డాలీ, విజయ్ కుమార్ కొండా, సుధీర్ వర్మ ఉన్నారు. వీరిలో సక్సెస్ అయిన దర్శకుడు డాలీ మాత్రమే. విశేషమేమిటంటే.. డాలీ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన 'తడాఖా' తమిళ హిట్ చిత్రం 'వేట్టై'కి రీమేక్.
ఇప్పుడు చందు మొండేటి కూడా చేస్తున్నది రీమేకే. స్ట్రయిట్ సబ్జెక్ట్లతో చైతు కాంబినేషన్లో రెండో సినిమా విషయంలో హిట్ కొట్టలేకపోవడం అనేది ఓ మైనస్ అయితే.. రీమేక్ తో అదే చైతు తో రెండో సినిమాని హిట్ చిత్రంగా మలుచుకునే సెంటిమెంట్ ఉండడం 'ప్రేమమ్'కి ప్లస్ పాయింట్ గా నిలిచే అంశం. మరి చందు ఆ సెంటిమెంట్ ప్రకారం హిట్ కొడతాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments