నాన్న సినిమా చూసి చాలా హ్యాపీ - నాగచైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
యువసామ్రాట్ నాగచైతన్య, గ్లామర్ స్టార్ రకుల్‌ప్రీత్‌సింగ్ కాంబినేషన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'. ఈ చిత్రం మే 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో యువసామ్రాట్ నాగచైతన్యతో ఇంటర్వ్యూ విశేషాలు.
సినిమా రిలీజవుతోంది కదా! టెన్షన్‌గా ఫీలవుతున్నారా?
నాన్న సినిమా చూసి చాలా హ్యాపీగా వున్నారు. అలాగే మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. కానీ నాకే కొంచెం భయంగా వుంది. ఫస్ట్‌టైమ్ కొత్త జోనర్‌లో ట్రై చేసాను. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా 'రారండోయ్' చిత్రాన్ని రూపొందించాం.
ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ అంతా కంప్లీట్ డిఫరెంట్‌గా వుంటుంది. ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. త్రూ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఇలాంటి ఫుల్‌ప్లెడ్జ్‌డ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌ని ఇంతవరకూ చేయలేదు. వెరీ లవబుల్ క్యారెక్టర్. ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కొంచెం టెన్షన్‌గా వుంది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ బాగా పండాయి. సినిమా అందరికీ నచ్చుతుంది.
ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది?
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రిలీజ్‌కి ముందే కళ్యాణ్ కృష్ణతో టైమ్ ఎక్కువ స్పెండ్ చేసేవాడ్ని. బేసిగ్గా తను మంచి రైటర్. నా ఇమేజ్, స్పాన్‌ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలనే కోరిక వుండేది. ఎగ్జాక్ట్‌గా నా బాడీలాంగ్వేజ్‌కి సరిపోయే కథని కళ్యాణ్ చెప్పారు. నాన్న, నేను, మా టీమ్ అంతా కూర్చొని 'నిన్నే పెళ్లాడతా' ఫ్లేవర్‌లో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తియ్యాలని అనుకున్నాం. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ కథని రెడీ చేశాడు కళ్యాణ్. కళ్యాణ్ మాస్ పల్స్ బాగా తెల్సు. ఈ సినిమా ప్రజెంటేషన్ చాలా కొత్తగా వుంటుంది. నా యాక్టింగ్ లెవెల్స్‌ని నెక్స్‌ట్ స్టెప్‌కి తీసుకెళ్లేవిధంగా చేయించాడు.
ఈ సినిమాకి కాస్టింగ్ పరంగా స్పెషల్ కేర్ తీసుకున్నట్లున్నారు?
ఔనండీ! సినిమా ప్రీ ప్రొడక్షన్‌లోనే అన్నీ పర్‌ఫెక్ట్‌గా చూసుకుని సెట్స్‌కి వెళ్లాం. అద్భుతమైన ప్యాడింగ్ కుదిరింది. అలాగే కాస్ట్యూమ్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా వుంటాయి. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫెస్టివల్ మూడ్‌లో వున్నట్లుంటుంది. బయటికి వచ్చాక చాలా రిలాక్స్‌డ్‌గా హ్యాపీగా వుంటారు. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.
మీ హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయడం ఎలా అన్పించింది?
చాలా సంతోషంగా వుంది. ఇంత పెద్ద స్కేల్ వున్న మూవీలో ఆపర్చ్యునిటీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. జగపతిబాబుగారు, సంపత్, దేవిశ్రీప్రసాద్, రకుల్ ప్రీత్, ఇంకా నెంబరాఫ్ ఆర్టిస్ట్‌లు ఈ చిత్రంలో నటించారు. అందరూ తమ తమ క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. నాన్న చాలా కేర్ తీసుకుని ఈ సినిమా నిర్మించారు. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్ అయి నా కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుంది.
మీ నాన్న సినిమా చూసి ఏమన్నారు?
ఫస్ట్ నుండి నాన్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చూసుకున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎడిటింగ్ రూమ్‌లో ప్రతి సీన్ చూసేవారు. సినిమా కంప్లీట్ అయ్యాక చూసి చాలా హ్యాపీగా వున్నారు.
రకుల్ ప్రీత్‌సింగ్ క్యారెక్టర్ గురించి?
ఫస్ట్‌టైమ్ రకుల్‌తో యాక్ట్ చేశాను. వెరీ ప్యాషన్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అంతకుముందు సినిమాలో చాలా గ్లామర్‌గా చేసింది. ఫస్ట్‌టైమ్ ఈ చిత్రంలో చాలా పద్ధతిగల అమ్మాయిగా భ్రమరాంబ క్యారెక్టర్‌లో బ్యూటిఫుల్‌గా నటించింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హైలైట్ అయ్యిందో రారండోయ్ చిత్రంలో భ్రమరాంబ క్యారెక్టర్ అంత హైలైట్ అవుతుంది.
ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
దేవి మా బేనర్‌లో నిర్మించిన చిత్రాలన్నింటికీ బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చారు. ఈ చిత్రానికి దేవి మ్యూజిక్ ఒన్ ఆఫ్ ది ఎస్సెట్‌గా నిలుస్తుంది. రీ-రికార్డింగ్ వండర్‌ఫుల్‌గా చేశాడు. ఫస్ట్‌టైమ్ కథ విని బాగా ఇంప్రెస్ అయి ఆర్.ఆర్. ఇలాగ చేస్తాను. నువ్ యాక్టింగ్ గ్రాఫ్ అలా పెంచుకో అని చెప్పాడు. అతను ఇచ్చిన ఇన్‌పుట్స్ నాకు బాగా హెల్ప్ అయ్యాయి. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోడానికి దేవి ఇచ్చిన సలహాలు బాగా హెల్ప్ అయ్యాయి.
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
కథకి యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. 'రారండోయ్' టైటిల్ సాంగ్ వుంది. సినిమా చూశాక ఇదే కరెక్ట్ టైటిల్ అని అందరూ ఏకీభవిస్తారు. సినిమా చూశాక అందరూ మంచి ఫీలింగ్‌తో బయటికి వస్తారు.
మీ పెళ్లెప్పుడు?
అక్టోబర్‌లో వుంటుంది. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయ పద్ధతుల్లో జరుగుఅంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇండియాలోనే మా పెళ్లి జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.
నెక్స్‌ట్ మూవీ ఎప్పుడు?
సాయి కొర్రపాటి బేనర్‌లో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. నెక్స్‌ట్ చందు మొండేటి లైన్ చెప్పాడు. నచ్చింది. ఒక నెలలో ఆ సినిమా డీటైల్స్ తెలుస్తాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం'' అంటూ ఇంటర్వ్యూ ముగించారు యువసామ్రాట్ నాగచైతన్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com