'సవ్యసాచి' మ్యూజిక్ డైరెక్టర్ గా...?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం `సవ్యసాచి`. ఈ నెల రెండో వారంలో సినిమా సెట్స్‌లోకి వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించబోతున్నారట. బాహుబలి తర్వాత కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమా సవ్యసాచి. యుద్ధం శరణం తర్వాత నాగచైతన్య చేస్తోన్న సినిమా ఇది. ప్రేమమ్ తర్వాత చైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో రానున్న సినిమా ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments