నాగచైతన్య 'సవ్యసాచి' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న "సవ్యసాచి" రెగ్యులర్ షూట్ నవంబర్ 8 నుంచి మొదలైన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం షూటింగ్ లో నిన్నటినుండి మాధవన్ కూడా జాయిన్ అయ్యారు. నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో రూపొందనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "మాధవన్ నిన్నటి నుంచి మా టీం లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. మాధవన్ పాత్ర తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని స్థాయిలో ఉండబోతోంది" అన్నారు.

మాధవన్ మాట్లాడుతూ.. "మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. "సవ్యసాచి" టీం తో కలిసి వర్క్ చేయనుండడం ఎగ్జయిటింగ్ గా ఉంది. అందరం కలిసి ఒక ఔట్ స్టాండింగ్ ఫిలిమ్ చేయనున్నాం" అన్నారు.

అలాగే.. రేపు (నవంబర్ 23) చిత్ర కథానాయకుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినిమాలో నాగచైతన్య లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM), కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.

More News

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌పోర్టు ల‌వ‌ర్స్ క్ల‌బ్ చిత్రానికి అవ‌స‌రం - చిన్నికృష్ణ‌

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్  ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్ ఇటీవ‌లే విడుదయ్యి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది.

గోపీతో బోజ్‌పురి నటుడు...

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. కె.కె.రాధామోహ‌న్ ఈ సినిమాను స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌పై నిర్మింబ‌చోతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమాగా సినిమా తెర‌కెక్క‌నుంది.

ఎనిమిదోసారి అపూర్వ క‌ల‌యిక‌

మ‌న సీనియ‌ర్ హీరో హీరోయిన్స్‌..అంటే 80 ద‌శ‌కంలో న‌టించిన తారలంద‌రూ ఈ మ‌ధ్య ఏడాకి కలుసుకుంటారు. ఈ క‌ల‌యిక‌కి ఓ ప్ర‌దేశాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ గెట్ టుగెద‌ర్‌కి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పేరే '80స్ సౌత్ యాక్టర్స్ రీ యూనియున్'.

ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఆ ప‌ని చేయిస్తాడా?

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈసారి మ‌ల్టీస్టార‌ర్‌ తో

గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత హారీష్ శంక‌ర్ పేరు మారు మోగింది. అయితే రామ‌య్యా వ‌స్తావ‌య్య ప్లాప్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ స‌క్సెస్‌లు ఆ స్థాయి పేరుని హరీష్‌కి తెచ్చి పెట్ట‌లేదు.