నాగచైతన్య - సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2
Send us your feedback to audioarticles@vaarta.com
షైన్ స్క్రీన్స్ తమ సంస్థ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా.. 'నిన్ను కోరి' లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్ తో డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. "ఏమాయ చేసావే, మనం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం చైతూ-సామ్ కలిసి నటిస్తున్న చిత్రం కావడం, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ జంట కలిసి వెండితెరపై కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి-హరీష్ పెద్ది మాట్లాడుతూ.. "నాగచైతన్య-సమంత జంటగా "నిన్ను కోరి" ఫేం శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. మా సంస్థ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న "కృష్ణార్జున యుద్ధం" ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతొంది. నాగచైతన్య-సమంతల కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com