నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "నిన్ను కోరి"తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.
దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది.
గోపీసుందర్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com