చైతు, మారుతి సినిమా సగం పూర్తయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌ఫుల్ మూవీస్‌తో విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్', 'కొత్తజంట', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలతో విజయాలను అందుకుని.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారాయన. ప్రస్తుతం ఈ దర్శకుడు నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజారెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు) సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే.. సగం సినిమాని పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రథమార్ధానికి సంబంధించి కేవలం 20 రోజుల్లో షూటింగ్‌ను పూర్తిచేసారని తెలిసింది. ద్వితీయార్ధానికి సంబంధించి 30 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
అయితే.. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'సవ్యసాచి' సినిమా కోసం చైతు అదనపు కాల్షీట్స్ ఇవ్వడంతో.. మారుతి సినిమా చిత్రీకరణకు కొంత జాప్యం ఏర్పడుతోందని సమాచారం. ఈ క్రమంలో 'సవ్యసాచి' సినిమా పూర్తయిన తర్వాత చైతు.. మారుతి సినిమాపై దృష్టి సారించనున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో.. మారుతి సినిమా సెప్టెంబర్‌లో గాని, అక్టోబర్‌లో గాని విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments