'నిన్నుకోరి'కి రివర్స్‌గా చైతు, సామ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆన్‌స్క్రీన్ మ్యాజిక్ చేసే జంటల్లో నాగచైతన్య, సమంత జోడీ ఒకటి. ‘ఏ మాయ చేసావే’తో తొలిసారి ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. తర్వాత 'మనం', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఆఫ్‌స్క్రీన్ కూడా బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్న ఈ జోడీ.. త్వరలోనే వెండితెరపై కనిపించనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ‘నిన్నుకోరి’ సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు చైతు, సమంత జంటగా తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో కూడా వీరిద్దరూ పెళ్ళైన జంటలాగే కనిపించనున్నారని సమాచారం.
కొత్త జంట అయిన వీరి మధ్యలోకి చైతును ప్రేమిస్తున్నానని మరో అమ్మాయి రావడం.. మాది అన్యోన్య దాంపత్యం చూడమంటూ ఆ అమ్మాయిని చైతు ఇంటికి తీసుకురావడం లాంటి వ్యవహారాలతో ఈ కథ ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అంటే.. 'నిన్నుకోరి' సినిమాకి రివర్స్‌గా ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి వీటిపై దర్శకుడు ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి. కాగా.. జూలై ఆఖరి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
చైతు నటించిన 'సవ్యసాచి', 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదల కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com