మరోసారి చై, సామ్ జోడీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య, సమంత జోడీ మరోసారి స్క్రీన్‌పై సందడి చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో నటించారు. ఆటోనగర్ సూర్య మినహా మిగిలిన చిత్రాలన్నీ మంచి విజయాలను అందుకున్నవే. తాజాగా మరోసారి ఈ హిట్ పెయిర్ జత కట్టనుందా? అనే వివరాల్లోకెళ్తే.. అక్కినేని నాగచైతన్య ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తగ్గిన తర్వాత సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తారు. దీని తర్వాత పరుశురామ్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.
అయితే నాగచైతన్య తమకు కేటాయించిన డేట్స్‌ను 14 రీల్స్ ప్లస్ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆ డేట్స్‌కు దిల్‌రాజుకు కేటాయించిందట. దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి నాగచైతన్య కూడా ఆసక్తి కూడా ఉన్నాడట. రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి రాసిన ఓ కథను విన్న నాగచైతన్య సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్నాడని టాక్. చైనత్యతోపాటు సమంతకు కూడా విక్రమ్ కథ నెరేట్ చేశాడట. ఆమెకు ఎంతో బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com