శైలజా రెడ్డి అల్లుడు ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
మహానుభావుడు వంటి ఘనవిజయం తరువాత మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు (ప్రచారంలో ఉన్న పేరు). నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. ఫస్టాఫ్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సెకండాఫ్‌కు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంటోంది.
కాగా.. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనుంది. 15 రోజుల పాటు జరిగే షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో రమ్యకృష్ణపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments