'శైలజా రెడ్డి అల్లుడు' డేట్ క‌న్‌ఫ‌ర్మ్‌

  • IndiaGlitz, [Tuesday,July 31 2018]

నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రమిది. సినిమాలో ర‌మ్య‌కృష్ణ అత్త‌ పాత్ర పోషిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రం స‌వ్య‌సాచిని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఓ పాట‌.. కొంత టాకీ మాత్ర‌మే మిగిలి ఉంది.