'లవ్ స్టోరి' సెప్టెంబర్ 10న థియేటర్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ లవ్ స్టోరి కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 10న లవ్ స్టోరి థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది.

లవ్ స్టోరి సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో 'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. లవ్ స్టోరి మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

More News

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' లో 'పంచమి' గా నిధి అగర్వాల్

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక.

'సకల గుణాభిరామ' ఫస్ట్ లుక్ లాంచ్

E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో

‘క్రేజీ అంకుల్స్‌’.. ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసే స‌ర‌దా పాత్ర‌లో మెప్పిస్తాను:  సింగ‌ర్ మ‌నో

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’.

ప్రముఖ సంగీత దర్శకులు తమన్ చేతులు మీదుగా మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని నటించిన 'అర్థం' ఫస్ట్‌లుక్ విడుదల

'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్...

'7 డేస్ 6 నైట్స్' ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి

విభిన్నమైన థ్రిల్లర్ 'డర్టీ హరి' తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే.