ఒకటా, రెండా.. చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'కి పది బంపర్ ఆఫర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమ కథా చిత్రాలకు ఉండే డిమాండే వేరు. ఇక శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు తెరకెక్కించిన చిత్రం అయితే.. చైతు, సాయి పల్లవి జంటగా నటించి ఉంటే.. ఆ క్రేజ్ ని ఊహించలేం. ఇప్పుడు అలాంటి సూపర్ బజ్ చైతు, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' చిత్రంపై ఉంది.
టీజర్, పాటలు, సారంగ దారియా సాంగ్ ఇలా ఒక్కొక్కటిగా ఈ చిత్రంపై అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు.
అందుకే థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేచి చూస్తున్నారు. మరి కొన్ని నెలలు కూడా థియేట్రికల్ రిలీజ్ కుదరకపోతే అప్పుడు ఓటిటి రిలీజ్ పై నిర్ణయం తీసుకుంటాం అని నిర్మాత నారాయణ్ దాస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మార్కెట్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని అద్దం పట్టె విధంగా ఉన్నాయి.
ఈ చిత్రానికి ఏకంగా 10 ఓటిటి ఆఫర్స్ వచ్చినట్లు నిర్మాత తెలిపారు. అయితే తాము సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులు థియేటర్స్ లోనే తమ చిత్రం చూడాలన్నది తమ కోరిక అని అన్నారు.
అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న మరో చిత్రం ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments