శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ మార్చుకుందట..
Send us your feedback to audioarticles@vaarta.com
లవ్ స్టోరీలను సైతం నీట్ అండ్ క్లీన్‌గా ప్రెజెంట్ చేయడంలో దిట్ట.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల. కొత్త కొత్త కాన్సెప్టులతో ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా సినిమాలను తెరకెక్కిస్తుంటారు. కుటుంబం మొత్తం కూర్చొని చూసేవిగా ఉండటం ఆయన ప్రత్యేకత. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఈ సినిమా రూపొందింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిజానికి ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా విడుదల తేదీని మార్చుకుందని టాక్. ఈ సినిమాను మే 13న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకూ కోవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితులు అదుపులోకి వస్తాయని.. 50 శాతం ఆక్యుపెన్సీ అనే అంశానికి కూడా తావుండదని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీని మే రెండవ వారానికి మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో ఒక ఆడ్ పాయింట్ గురించి శేఖర్ కమ్ముల చర్చించారని.. ఒక బర్నింగ్ టాపిక్‌తో సినిమాను తెరకెక్కించారని.. తన శైలికి భిన్నంగా ఈ సినిమాను రూపొందించారని సమాచారం. శేఖర్ కమ్ముల ఎంచుకున్న పాయింట్ తప్పక క్లిక్ అవుతుందని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments