నాగ చైతన్య, సాయికొర్రపాటి, సురేష్ బాబు చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య హీరోగా వారాహి చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ఆర్.పి.మారిముత్తు దర్శకత్వంలో సాయికొర్రపాటి, డి.సురేష్‌బాబు నిర్మాతలుగా కొత్త చిత్రం వారాహి చలన చిత్రం ఆఫీస్‌లో ఈరోజు ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్ కొట్టగా, ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేసి స్క్రిప్ట్‌ను అందించారు. ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, విజయేంద్రప్రసాద్, శ్రీకాంత్, గుణ్ణం గంగరాజు, దేవినేని ప్రసాద్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాయికొర్రపాటి మాట్లాడుతూ - ``వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 10గా, సురేష్‌బాబుగారి అసోసియేషన్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాగచైతన్య, లావణ్యత్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. త్త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం`` అన్నారు.
సమర్పణః సాయి శివాని, కథః డేవిడ్ ఆర్.నాథన్, మాటలుః అబ్బూరి రవి, మ్యూజిక్ః వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీః నికేత్ బొమ్మి, ఆర్ట్ః రామకృష్ణ, స్క్రీన్‌ప్లేః డేవిడ్ ఆర్.నాథన్, అబ్బూరి రవి, నిర్మాతః రజనీ కొర్రపాటి, దర్శకత్వంః కృష్ణ ఆర్.వి.మారి ముత్తు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com