నాగ చైతన్య, సాయికొర్రపాటి, సురేష్ బాబు చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,February 07 2017]

నాగ‌చైత‌న్య హీరోగా వారాహి చల‌న చిత్రం, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.పి.మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో సాయికొర్రపాటి, డి.సురేష్‌బాబు నిర్మాత‌లుగా కొత్త చిత్రం వారాహి చ‌ల‌న చిత్రం ఆఫీస్‌లో ఈరోజు ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి గుణ్ణం గంగ‌రాజు క్లాప్ కొట్ట‌గా, ఎం.ఎం.కీర‌వాణి కెమెరా స్విచ్చాన్ చేసి స్క్రిప్ట్‌ను అందించారు. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డి.సురేష్‌బాబు, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, కీర‌వాణి, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీకాంత్‌, గుణ్ణం గంగ‌రాజు, దేవినేని ప్ర‌సాద్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సాయికొర్ర‌పాటి మాట్లాడుతూ - ''వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా, సురేష్‌బాబుగారి అసోసియేష‌న్‌తో ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. నాగచైత‌న్య‌, లావ‌ణ్య‌త్రిపాఠి, శ్రీకాంత్‌, రావు ర‌మేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. త్త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం'' అన్నారు.

స‌మ‌ర్ప‌ణః సాయి శివాని, క‌థః డేవిడ్ ఆర్‌.నాథ‌న్‌, మాట‌లుః అబ్బూరి ర‌వి, మ్యూజిక్ః వివేక్ సాగ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః నికేత్ బొమ్మి, ఆర్ట్ః రామ‌కృష్ణ‌, స్క్రీన్‌ప్లేః డేవిడ్ ఆర్‌.నాథ‌న్‌, అబ్బూరి ర‌వి, నిర్మాతః ర‌జ‌నీ కొర్ర‌పాటి, ద‌ర్శ‌క‌త్వంః కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు.

More News

ఇద్దరు హీరోయిన్స్ తో అఖిల్

అఖిల్ సినిమా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ తన రెండో సినిమా చేయడానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మనం, 24 వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ పై సినిమా తీస్తాః బాలయ్య

ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి,తన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తిరుగులేని కథానాయకుడు

మహేష్ కు కోర్టు ఆదేశం...

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

'సింగం3' చేయడం రెస్పాన్సిబిలిటీగా భావించాను - హీరో సూర్య

సూర్య, అనుష్క, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో రానున్న సినిమా `సింగం3`. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు.

'మెగా 150 గేమ్' ను విడుదల చేసిన వి.వి.వినాయక్, దిల్ రాజు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంలో మెగాభిమానులు ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన సతీష్ బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి `మెగా 150` గేమ్ను ప్లాన్ చేశారు