చైతు టైటిల్ చాలా ఇష్టం అంటున్ననాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఊపిరి ఆడియో వేడుక నిన్న రాత్రి నోవాటెల్ హాటల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నాగ్ మాట్లాడుతూ....చైతు సినిమా టైటిల్ సాహసం శ్వాసగా సాగిపో చాలా ఇష్టం. ఎందుకంటే సాహసంతోనే శివ, గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు చేసాను.
నిన్నే పెళ్లాడతా తర్వాత అన్నమయ్య సినిమా చేస్తుంటే నీకు అన్నమయ్య సినిమా అవసరమా అన్నారు. కానీ నేను సాహసంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఊపిరి కూడా అంతే సాహసంతో చేసాను. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు. నాగ్ మాటలు...సినిమా ట్రైలరు చూస్తుంటే ఊపిరి నాగ్ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలవడం ఖాయం అనిపిస్తుంది అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com