సమంతతో తన పెళ్లి ఎప్పుడో చెప్పిన చైతన్య..!
- IndiaGlitz, [Wednesday,October 05 2016]
నాగచైతన్య - సమంత ప్రేమలో పడడం, ఆతర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే...పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? ఏ సంప్రదాయం ప్రకారం చేసుకోబోతున్నారు..? అనేదే తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే... చైతన్య నటించిన ప్రేమమ్ చిత్రం దసరా కానుకగా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైతన్య పెళ్లి విషయాల పై క్లారిటీ ఇచ్చేసాడు. మీరు హిందు, సమంత క్రిస్టియన్. ఏ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైతు...
రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకుంటాం. అది కూడా ఏదో సీక్రెట్ గా కాకుండా అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాం అని తెలిపారు. ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు....వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాం. అయితే...నా కన్నా అఖిల్ పెళ్లే ముందు జరుగుతుంది అని చెప్పారు చైతు..!