ఐరా క్రియోషన్స్ లో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా చిత్రం ఏప్రిల్ 10న ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
"ఊహలు గుసగుసలాడే", "దిక్కులు చూడకు రామయ్య", "లక్ష్మిరావే మా ఇంటికి", "కళ్యాణవైభోగం"," జ్యోఅచ్చుతానంద" లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించిన నాగశౌర్య హీరొగా, కన్నడ లో "కిరిక్ పార్టి" అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అందరి మనసులు దొచుకున్న రష్మిక మండన్న హీరోయిన్ గా తెలుగుకి పరిచయం చేస్తూ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన వెంకి కుడుముల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ మూల్పూరి లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్‌టైనర్ గా కాలేజి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ఏప్రిల్ 10న పలువురు రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. తెలుగు ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతు ఈ చిత్ర వివరాలు నిర్మాతలు తెలియజేసారు.
ఈ సందర్బంగా నిర్మాతల్లో ఒకరైన శంకర ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ.. " మా అబ్బాయి నాగశౌర్య ని తో చిత్రాన్ని నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. త్రివిక్రమ్ గారి అసోసియోట్ వెంకి కుడుముల చెప్పిన కథ మాకు నచ్చి మా బ్యానర్ లోనే చేయ్యాలని నిర్ణయించుకున్నాము. వెంకి మాకు చాలాకాలం నుండి సుపరిచితుడు కావటం అతని టాలెంట్ ని మేము నమ్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాము. అలాగే కథకి సరిపోయోలా హీరోయిన్ ని ఎంచుకోవాలి అనుకుంటున్న సమయంలో కన్నడలో అతిపెద్ద విజయాన్ని సాధించిన కిరిక్ పార్టి ఫేం రష్మిక మండన్న ఎంచుకున్నాము. అప్పటికే దక్షిణాది సూపర్‌స్టార్స్ ఆమె డేట్స్ కొసం ఎంక్వరీలు స్టార్టయ్యాయి. మా సొంత బ్యానర్ లో నాగశౌర్య ని పెట్టి చిత్రాన్ని నిర్మిస్తున్నాము అంటే అది మంచి విజయాన్ని సాధించాలి నాగశౌర్యకి కెరీర్ మరో మెట్టు ఎక్కెలా వుండాలి అలాగే మా బ్యానర్ కి ఇది మంచి శుభారంభం కావాలి అనేది మనసులో గట్టి సంకల్పం పెట్టుకుని చేస్తున్నాము. ఏవిషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. కాలెజి బ్యాక్ డ్రాప్ లో వెరీ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాము. ఏప్రిల్ 10 న పలువురు ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ పూజాకార్కక్రమాలతో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు ఆరోజు తెలియజేస్తాం.. "అని అన్నారు
దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ.. " నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన హీరో నాగశౌర్య గారికి , నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకరప్రసాద్ ముల్పూరి గారికి ధన్యవాదాలు. నాగశౌర్య కి జంటగా రష్మిక మండన్న నటిస్తుంది. హీరో నాగశౌర్య లుక్ అండ్ క్యారక్టరైజేషన్ కొత్తగా వుంటుంది. ప్రేక్షకులు నాగశౌర్య ని కొత్తగా చూస్తారు. ఫ్యామిలి అంతా వచ్చి చక్కగా నవ్వుకునే మంచి కామెడి ఈ చిత్రంలో వుంటుంది. లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 న రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్యక్రమాలతో ప్రారంభం కానుంది. "
ఈ చిత్రానికి సంగీతం- సాగర్ మహతి, సినిమాటొగ్రఫి- సాయి శ్రీరామ్. నిర్మాతలు- ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి దర్శకత్వం- వెంకి కుడుముల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments