నాగచైతన్య, అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ చిత్రం తర్వాత కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఉగాది పండగ రోజున 'రారండోయ్.. వేడుక చూద్దాం' టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈచిత్రానికి సంబంధించి రెండు పోస్టర్స్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఇటు ప్రేక్షకుల్ని, అటు అభిమానుల్ని ఈ లుక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల తెలియజేస్తూ - ''ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ ఎండ్ వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లానింగ్ జరుగుతోంది. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో మరో భారీ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నాగచైతన్య కెరీర్‌లో ఇది ఓ మెమరబుల్ మూవీ అవుతుంది. దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్న చిత్రమిది. కమర్షియల్‌గా డెఫినెట్‌గా చాలా మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
యువసామ్రాట్ నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్, ఇష్క్ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments