చైతు సినిమా రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా `రా రండోయ్..వేడుక చూద్దాం` అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. నాగచైతన్య సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను సమ్మర్ సందర్భంగా మే 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఈ తేదీని స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ విడుదల కావాల్సింది. కానీ బన్ని సినిమా ఆలస్యం కావడంతో ఆ డేట్లో చైతన్య వచ్చేస్తున్నాడు. సమ్మర్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి చైతు చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com