close
Choose your channels

చైతన్య ప్రేమమ్ వీడియో సాంగ్ ఆగస్టు 29న - ఆడియో సెప్టెంబర్ 20న విడుదల

Wednesday, August 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ప్రేమమ్.
ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...'ఈ చిత్రం లోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది.
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా 'ఎవరే' పాట వీడియో ను విడుదల చేయ‌నున్నాం. అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజైన సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానులు,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ప్రేమ‌మ్ చిత్రాన్ని అక్టోబర్ లో దసరా పండుగ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రేమమ్ అన్నారు.
ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్. ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment