చైతన్య ప్రేమమ్ వీడియో సాంగ్ ఆగస్టు 29న - ఆడియో సెప్టెంబర్ 20న విడుదల

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ప్రేమమ్.
ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...'ఈ చిత్రం లోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది.
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా 'ఎవరే' పాట వీడియో ను విడుదల చేయ‌నున్నాం. అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజైన సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానులు,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ప్రేమ‌మ్ చిత్రాన్ని అక్టోబర్ లో దసరా పండుగ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రేమమ్ అన్నారు.
ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్. ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి

More News

రీమేక్‌లో సునీల్‌

క‌మెడియ‌న్ నుండి హీరో అయిన సునీల్ మ‌రో రీమేక్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. మిష్ట‌ర్ పెళ్లికొడుకు, త‌ఢాఖా వంటి రీమేక్స్‌లో న‌టించిన సునీల్ ఇప్పుడు మ‌ల‌యాళం సినిమా టు కంట్రీస్‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌.

శృతిహాస‌న్ ఐటెమ్ సాంగ్‌...

ద‌క్షిణాది, ఉత్త‌రాదిన బిజీ హీరోయిన్స్‌లో శృతిహాస‌న్ ఒక‌రు. కేవలం హీరోయిన్‌గానే కాకుండా గాయ‌నిగా కూడా శృతిహాస‌న్ సంద‌డి చేస్తుంటుంది. అలాగే స్పెష‌ల్ సాంగ్స్‌లో కనిపించి క‌నువిందు చేస్తుంటుంది.

యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న చైతు సాంగ్..!

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

అభిమానులు అంటే అంత చిన్న‌చూపా..?

మెగాస్టార్ పుట్టిన‌రోజు..అభిమానుల‌కు పండుగ రోజు..! మెగాస్టార్ తొమ్మిది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత సినిమా చేస్తుండ‌డం...స‌రిగ్గా ఆ సినిమా షూటింగ్ టైమ్ లో చిరు పుట్టిన‌రోజు రావ‌డంతో అభిమానులు ఈ పుట్టిన‌రోజును చాలా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసారు.

నాని 'మజ్ను' ఆడియో26న విడుదల

నాని హీరోగా నటించిన సూపర్హిట్ చిత్రం 'భలే భలే మగాడివోయ్'తర్వాత అదే సూపర్హిట్ మ్యూజిక్ ను రిపీట్ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపిసుందర్ సారధ్యంలో 'మజ్ను' పాటలు రూపొందాయి.