యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న చైతు సాంగ్..!

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ప్రేమ‌మ్ చిత్రంలోని ఎవ‌రే...సాంగ్ ను రిలీజ్ చేసారు.

రాజేష్ మురుగేష్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎవ‌రే..సాంగ్ యూట్యూబ్ లో 1 మిలియ‌న్ (10 ల‌క్ష‌లు) వ్యూస్ సాధించడం విశేషం. ఒరిజిన‌ల్ సాంగ్ వ‌లే ఈ పాట కూడా ఆక‌ట్టుకోవ‌డం... త‌క్కువ రోజుల్లో 1 మిలియ‌న్ వ్యూస్ రావ‌డం బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ప్రేమమ్ కి ఎంత క్రేజ్ ఉందో..! ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.