చైతుతో మరోసారి లైలా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం వారాహి చలన చిత్రం బ్యానర్‌ఫై 'యుద్ధం శరణం' సినిమా చేస్తున్నాడు. కృష్ణ మారిముత్తు అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతుండగా సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చైతు చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
అల్రెడి చైతన్యతో `ప్రేమమ్` వంటి లవ్ ఎంటర్టైనర్ను తెరకెక్కించి హిట్ అందించిన చందు మొండేటి చైతు కోసం ఓ మంచి లైన్‌ను సిద్ధం చేసుకున్నాడట. చైతు కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే సెట్స్‌లోకి వెళ్ళనున్న ఈ సినిమాను శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
ఈ చిత్రంలోఓ నాగచైతన్య సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. పూజా హెగ్డే చైతన్య 'ఒక లైలా కోసం' సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నాగచైతన్యతో మరోసారి జత కడుతుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com