ఒకేసారి రెండు సినిమాలు.. నాగ చైతన్య ప్లాన్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ చైతన్య రూటే సపరేటు. ఢిఫరెంట్ జానర్స్‌లో వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ బాట వేసుకున్నాడు. మేనమామ వెంకటేశ్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ ‘వెంకీ మామ’ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ అక్కినేని నటవారసుడు ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
ఆ సినిమా అయిపోగానే గీత గోవిందం ఫేమ్ పరశురామ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాలో తండ్రి నాగార్జునతో కలిసి నటించనున్నాడు. ఈ రెండు షూటింగులు వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు శేఖర్ సినిమా పూర్తి చేసుకుని.. ఆ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లనున్నాడని సమాచారం. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని.. రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నాడట. ఈ రెండు సినిమాల లుక్స్ పరంగా పెద్ద తేడా ఉండదు కాబట్టి.. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్‌లో నాగచైతన్య ఒకేసారి పాల్గొనాలని చైతు భావిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments