నాగచైతన్య, నితిన్ ఇద్దరిలో ఎవరు కరెక్ట్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తర్వాత స్టార్స్ తో సినిమా చేయడానికి కాస్త టైం పడుతుంది. కనుక ఈ గ్యాప్ లో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు. కథ రెడీ చేసాడు. అయితే హీరో ఎవరైతే బాగుంటారా అని ఆలోచించి చైతుతో చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడు. చైతుని అడిగితే...ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా పూర్తయ్యాక చేస్తానన్నాడు. కానీ త్రివిక్రమ్ కి అంత టైం లేదు. అయితే త్రివిక్రమ్ హీరో కోసం అన్వేషిస్తున్నారన్న వార్త తెలుసుకున్న నితిన్ నేను చేస్తానంటూ ముందుకు వచ్చాడు. ఎలాగైనా సరే త్రివిక్రమ్ తో సినిమా చేయాలని నితిన్ ఫిక్స్ అయ్యాడు. ఆఖరికి సాధించాడు.
అయితే త్రివిక్రమ్ నితిన్ తో చేస్తున్న సినిమా టైటిల్ అ ఆ. అనసూయ రామలింగం వెర్షెస్ ఆనంద్ విహారి అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్ చూస్తుంటే లేడీ ఓరియంటెడ్ మూవీనా అనే అనుమానం కలుగుతుంది. ఈ సినిమలో సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఎక్కువ భాగం ఒక ఇంట్లోనే జరుగుతుందట. అందుకనే షూటింగ్ మూడు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...ఈ సినిమా వదులుకున్న నాగచైతన్య నిర్ణయం కరెక్టా..? లేక సినిమా చేస్తున్న నితిన్ నిర్ణయం కరెక్టా...? తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com