చైత‌న్య త‌దుప‌రి ఖ‌రారు.. రూ100 కోట్ల డైరెక్ట‌ర్‌కు ఎట్ట‌కేల‌కు ఛాన్స్‌

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు శ‌నివారం. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు అంద‌రూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. కాగా.. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆయ‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే.. నాగ‌చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడ‌ట‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది మే నెల‌లో కానీ.. లేదా మే త‌ర్వాత కానీ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఆలోపు నాగ‌చైత‌న్య నాగార్జున‌తో క‌లిసి 'సొగ్గాడే చిన్ని నాయ‌నా' సీక్వెల్ 'బంగార్రాజు'ను పూర్తి చేస్తాడ‌ట‌. ఆలోపు ప‌రుశురాం ఫైన‌ల్ డ్రాఫ్ట్‌ని సిద్ధం చేస్తాడ‌ని టాక్‌.

'గీత గోవిందం' వంటి రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాను డైరెక్ట్ చేసిన ప‌రుశురాంకు వెంట‌నే సినిమాలు రాలేదు. ఆయ‌న త‌దుప‌రి సినిమా కోసం హీరోల చుట్టూనే గ‌ట్టిగానే తిరిగాడు. మ‌హేశ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోల చుట్టూ తిరిగినా ప‌రుశురాంను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అయితే ప‌రుశురాం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న క‌థ‌తో రీసెంట్‌గా నాగ‌చైత‌న్య‌ను క‌లిశాడు. చైతుకి క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న ఓకే చెప్పాడ‌ట‌. ఈలోపు చైత‌న్య త‌న క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకుంటాడు. ప‌రుశురాం త‌న స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసేస్తాడ‌ట‌.

More News

శివసేనకు ఎన్సిపి షాక్ ... మహారాష్ట్ర సీఎం గా ఫడ్నవీస్ ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. నిన్నటి వరకు శివసేన , ఎన్సిపి, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించిన...

బీజేపీకి మద్ధతిచ్చేది లేదు... అజిత్ పవార్ హద్దు మీరారు : శరద్ పవార్

మహా రాజకీయ పరిణామాలపై స్సందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన....

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం రిలీజ్ ఖ‌రారు

రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.

అర్జున్ సురవరం ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్

అర్జున్ సురవరం ... క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 29న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్,

శివసేనకు అజిత్ పవార్ చెక్ ... ఫడ్నవీస్ దే మహాపీఠం

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలరోజులుగా చెలరేగిన దుమారం హై డ్రామాల మధ్య ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటు పై అటు బీజేపీ ఇటు శివసేనల మధ్య జరిగిన రాజకీయ చదరంగంలో చివరికి బీజేపీ నెగ్గింది.