చైత‌న్య నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనేనా..?

  • IndiaGlitz, [Friday,April 17 2020]

అక్కినేని నాగ‌చైత‌న్య సెన్సిటివ్ స‌బ్జెక్ట్స్‌ను డీల్ చేసే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాను ఏప్రిల్ లేదా మే నెల‌లో విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల విష‌యంలో సందిగ్ధం నెల‌కొంది.

దీని త‌ర్వాత నాగ‌చైత‌న్య హీరోగా ప‌రుశురామ్ ఓ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే పరుశురామ్‌కు మ‌హేశ్ నుండి పిలుపు రావ‌డంతో చైతు సినిమాను ప‌క్క‌న పెట్టేసి వెళ్లిపోయాడు. దాంతో చైత‌న్య ఇప్పుడు మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి చైత‌న్య చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నాని 25వ చిత్రం ‘వి’ను మోహనకృష్ణ ఇంద్ర‌గంటి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది. కానీ విడుద‌ల కాలేదు. త‌దుప‌రి సినిమా విడుద‌ల కాకుండానే ఇంద్ర‌గంటి మ‌రో సినిమాను ట్రాక్‌లో పెట్టుకుంటున్నాడు. అంతా ఓకే అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ట‌.

More News

మహేశ్ లవ్‌స్టోరీ.. మ్యూజిక్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా

శ్రియ‌పై సిల్లీ కామెంట్స్‌.. ఆమె భ‌ర్త ఏమ‌న్నాడంటే..?

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన శ్రియ ఇప్పుడు త‌న ల‌వ‌ర్ అండ్రూ కొచ్చిన్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. వీరిద్ద‌రూ స్పెయిన‌ల్‌లో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

అప్పుడు.. ఇప్పుడు బన్నీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

ఎన్టీఆర్‌ డ‌బుల్ ట్రీట్ ఇస్తాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 20. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులకు డ‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

చిరుతో క‌లిసి న‌టించ‌నున్న స్టైలిష్ స్టార్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.