చైతు మూవీకి నాగ్ వాయిస్ ఓవర్..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు మేనమామ విక్టరీ వెంకటేష్ కామియో రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకు కోసం నాగ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. ఈ సినిమాకి ఓ వైపు నాగ్ మరో వైపు వెంకీ...పార్టిసిపేషన్ ఉండడంతో మూవీపై మరింత క్రేజ్ పెరుగుతుంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ప్రేమమ్ టీమ్ త్వరలో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయాలనుకున్నారు..అయితే ఇదే సంస్థ నిర్మిస్తున్న బాబు...బంగారం చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుచేత ప్రేమమ్ ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments