ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చైతు, మోహ‌న్‌బాబు?

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'కి స‌ర్వం స‌న్న‌ద్ధం అవుతుంది. సినిమాలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించబోయే న‌టీన‌టులు ఒక్కొక్క‌రు ఫైన‌ల్ అవుతున్న‌ట్లు టాక్ విన‌పడుతుంది. బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో..బ‌స‌వ‌తారం నంద‌మూరిగా విద్యాబాల‌న్ న‌టిస్తుండ‌గా.. రానా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక శ‌ర్వానంద్ మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. కాగా ఇప్పుడు విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం నాగ‌చైత‌న్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలిసింది.

ఇటీవ‌ల మ‌హాన‌టి చిత్రంలో ఎ.ఎన్‌.ఆర్ పాత్ర‌లో చైతు మెప్పించారు. కాగా ఇప్పుడు మోహ‌న్‌బాబు మంచు కూడా ఇందులో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్‌ని నా అన్న‌గారు అని సంబోధించే మోహ‌న్‌బాబు, ఆయ‌న ఆశీర్వాదంతో పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ‌తో కూడా మంచు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగా మోహ‌న్‌బాబు ఈ బ‌యోపిక్‌లో ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపిస్తార‌ని టాక్‌. అయితే మోహ‌న్‌బాబు చేయ‌బోయే పాత్రేంటో తెలియ‌లేదు.