చైతూ థాట్స్ తో కొత్తవాళ్లు హ్యాపీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక సినిమా విజయం ఎందరికో దారి చూపిస్తుంది. మరెందరికో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. ఒక రకమైన మంచి భరోసానిస్తుంది. ఇప్పుడు `మజిలీ` సినిమా చేసిందదే. కేవలం `నిన్నుకోరి` సినిమా అనుభవంతో శివ నిర్వాణ `మజిలీ`ని తీశారు. పెళ్లయిన భార్యాభర్తల్లో ఉన్న ప్రేమను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమా కలెక్షన్లు నాగచైతన్య కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్లుగా నిలిచాయి.
దాంతో నాగచైతన్య ఫుల్ దిల్ఖుష్గా ఉన్నారు. అందుకే కొత్తా పాతా తేడా లేకుండా అందరు చెప్పే కథలనూ వింటున్నారు. మరీ ముఖ్యంగా కొత్తవారి కథలను మరింత ఆసక్తికరంగా వింటున్నారు. షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసిన వాళ్లను, ఒకట్రెండు చిత్రాలతో తమను ప్రూవ్ చేసుకున్న వాళ్లను నమ్మాలని నిర్ణయించుకున్నారు. సో ఈ విషయం కొత్తవారికి హ్యాపీ కలిగించేదేగా. కథలో దమ్ముంటే చైతూకి చెప్పి ఓకే చేయించుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout