సంక్రాంతి బరిలో చైతూ
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితా బయటికొస్తోంది. యన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలు కథానాయకుడు, మహానాయకుడు 2019 సంక్రాంతికి అలరించనున్నాయి. కాకపోతే రెండు వారాల గ్యాప్‌తో అనుకోండి. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్2 కూడా సంక్రాంతికే విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగనుంది.
యాక్షన్ చిత్రంగా రంగంలోకి దిగనుంది రామ్‌చరణ్ సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్‌చరణ్ సినిమా కూడా సంక్రాంతికి అలరించనుంది. ఇప్పటిదాకా ఈ మూడు సినిమాల సంగతులే అందరికీ తెలుసు. అయితే తాజాగా సంక్రాంతి బరిలోకి దూకనున్నారు చైతూ దంపతులు. నాగచైతన్య, సమంత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. పెళ్లయిన దంపతుల మధ్య చోటుచేసుకునే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సో ఇప్పటికి రిజిస్టర్ అయినవి నాలుగు.. సారీ ఐదు సినిమాలన్నమాట. అంటే.. యన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలు కదా..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com