దేవ‌దాసు లుక్‌లో నాగ‌చైత‌న్య‌

  • IndiaGlitz, [Friday,April 13 2018]

భగ్న ప్రేమికుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది దేవదాసు. అటువంటి దేవదాసు పేరు వినగానే సినీ ప్రియుల మదిలో మెదిలే నటుడు అక్కినేని నాగేశ్వరరావు.  వాస్త‌వానికి దేవదాసు పాత్ర‌లో చాలా మంది నటించారు.. కాని ఆ పాత్రకి జీవం పోసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది మాత్రం ఏఎన్నార్. ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకువచ్చిన ఆ పాత్రలో.. ఇప్పుడు ఆయన మనవ‌డు నాగ చైతన్య కనిపించబోతున్నార‌ని స‌మాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే. సావిత్రి జీవిత కథగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో..  సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా..  ఏఎన్నార్‌గా నాగ చైతన్య కనిపిస్తున్నారు. ఏఎన్నార్‌గా చైతు కనిపించే సన్నివేశాలు రెండూ లేదా మూడు మాత్రమే అని తెలుస్తోంది.

అందులో.. ఈ దేవదాసు లుక్‌తో క‌నిపించే సీన్‌ ఒకటి ఉంటుంద‌ట‌. అప్పటి దేవదాసు పాత్రలో.. ఏఎన్నార్ చేతిలో ఏ విధంగా అయితే మందు సీసా, మెడలో కండువా, పక్కన కుక్క ఉన్నాయో.. ఇప్పుడు అదే గెట‌ప్‌తో ఆయన మనవ‌డు చైతు కూడా కనిపించబోతున్నారు.

ఈ సినిమాకి సంబంధించి చైతు ఫస్ట్ లుక్‌ను కూడా ఈ గెట‌ప్‌లోనే విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోంద‌ట‌.  దేవదాసుగా చైతుని వెండితెరపై చూడాలంటే మాత్రం.. మే 9 వరకు వేచి చూడ‌క తప్పదు.

More News

'నా పేరు సూర్య' చిత్రంలోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా

ఆ సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి: 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' నిర్మాత రామ్మోహనరావు

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారాగణంతో  హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలుగా

రంగస్దలం సెట్లొ 'సంత' ఫస్ట్ లుక్ లాంఛ్ చెసిన సుకుమార్

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత".

స‌మంత‌ని ప్రేమించే పాత్ర‌లో..

మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్న క‌రుణాక‌ర‌న్‌

సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ' (ప్రచారంలో ఉన్న పేరు).