బాలీవుడ్ రీమేక్‌లో నాగచైతన్య?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ‘మజిలీ’తో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్న హీరో నాగచైతన్య ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డిఫరెంట్ లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు. తదుపరి ఈ హీరో ‘ఆర్.ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ఇది కాకుండా ఓ బాలీవుడ్ రీమేక్‌లో చైతు నటిస్తాడని టాక్. వివరాల ప్రకారం బాలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన విజయం సాధించిన చిత్రాల్లో ‘చిచోరే’ ఒకటి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటుందట. ఈ రీమేక్‌లో చైతుని నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయట. త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
ఇప్పుడు నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతన్య తెలంగాణ మాట్లాడే కుర్రాడి పాత్రలో నటిస్తుంటే.. సాయి పల్లవి భరత నాట్యం నేర్చుకునే అమ్మాయి పాత్రలో నటిస్తుంది. మ్యూజికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు ఫిబ్రవరిలో కాకుండా ఏప్రిల్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ దాస్ కె.నారంగ్, ఎఫ్.డి.సి ఛైర్మన్ పి.రామ్మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఊరు నుండి సిటీకి వచ్చి ఏదైనా సాధించాలనుకునే యువతీ యువకుడు మధ్య నడిచే ప్రేమకథ. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments