బాలీవుడ్ రీమేక్‌లో చైతు..?
- IndiaGlitz, [Wednesday,September 11 2019]
అక్కినేని నాగచైతన్య క్రమంగా కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రేమ కథలు, యాక్షన్ కథలకు మాత్రమే తాను పరిమితం కావాలని అనుకోవడం లేదు. ఈ ఏడాది 'మజిలీ'తో చైతన్య హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మధ్య వయస్కుడిగా నాని కనపడ్డాడు కూడా. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీలో నటించబోతున్నాడని టాక్. అయితే అది బాలీవుడ్ రీమేక్ సినిమా అని సినీ వర్గాల సమాచారం. గత ఏడాది విడుదలైన 'బదాయి హో' సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగులో బోనీకపూర్, దిల్‌రాజు కలిసి నిర్మించబోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారట. స్క్రిప్ట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులంటూ కాకుండా ముందు నుండే ప్లానింగ్ చేసుకుంటున్నారట. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేయాలని బోనీకపూర్, దిల్‌రాజు భావిస్తున్నారట. హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రలో చైతన్య కనిపిస్తారట.
తెలుగులో బోనీ ఎంట్రీ...
బాలీవుడ్లో సీనియర్ నిర్మాత అయిన బోనీకపూర్ ఈ ఏడాది అజిత్ నటించిన 'నేర్కొండ పార్వై' చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ అయ్యింది. అది కూడా అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్'కి రీమేక్. ఇప్పుడు అజిత్‌తో మరో సినిమాను ట్రాక్ ఎక్కించేస్తున్నారు బోనీకపూర్. కోలీవుడ్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి నిర్మాతగా రంగం సిద్ధం చేసేసుకున్నారు బోనీ కపూర్. శ్రీదేవి భర్త అయిన బోనీకపూర్ హిందీ నిర్మాతే అయినా.. తెలుగు దర్శక నిర్మాతలతో ఆయనకు మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.