మరో రీమేక్ లో చైతు..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ప్రేమమ్ చిత్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతుంటే...సోగ్గాడే చిన్ననాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతన్య నటించే రొమాంటికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఈ సినిమా తర్వాత చైతన్య సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కృష్ణ తెరకెక్కించనున్నారు. అయితే...పంజాబీలో విజయం సాధించిన సింగ్ వెర్సెస్ కౌర్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించే సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com