2 స్టేట్స్ తెలుగు రీమేక్ లో చైతు..!
Saturday, November 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 2 స్టేట్స్. మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది అంటూ సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచెమ్..వినాయక్ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు.
వెంకట్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ లో నాగచైతన్య నటించనున్నట్టు సమాచారం. ఇటీవల వెంకట్ నాగ చైతన్యను కలిసి కొన్ని మార్పులతో కథ చెప్పగా...కథ విని చైతన్య ఈ మూవీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు అని తెలిసింది. అయితే...ఈ చిత్రంలో చైతన్య, సమంత కలిసి నటిస్తే బాగుంటుందనేది అభిషేక్ పిక్చర్స్ ఆలోచన. చైతన్య ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు. మలేషియా నుంచి వచ్చిన తర్వాత చైతన్య ఈ మూవీ గురించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments