చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!
Saturday, December 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. 1980 - 1990 మధ్య జరిగే విభిన్న గ్రామీణ ప్రేమకధా చిత్రంగా ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించనున్నారు.
ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటించనుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే...తాజా సమాచారం ఏమటంటే...చరణ్ సరసన ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని తెలిసింది. ఈస్ట్ గోదావరిలో ఒక వారం రోజులు షూటింగ్ చేసి ఆతర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కాగా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments