హిట్ సీక్వెల్‌కు బై చెప్పేసిన చైతు...!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున కెరీర్ బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన చిత్రాల్లో ‘సొగ్గాడే చిన్ని నాయనా’ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు అక్కినేని నాగార్జున ఎప్పుడో చెప్పాడు. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కూడా చాలా రోజులుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తూనే ఉన్నాడు. నాగార్జున స్క్రిప్ట్ నచ్చాకే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఓకే అన్నాడు. ఎట్టకేలకు త్వరలోనే సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. నాగార్జున తాత పాత్రలో, చైతన్య మనవడి పాత్రలో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా నుంచి నాగచైతన్య బయటకు వెళ్లిపోయాడట. అందుకు కారణం.. ఎప్పుడో నటించాల్సిన సినిమా కోవిడ్ ప్రభావంతో ఆలస్యంగా ప్రారంభం అవుతుండటంతో ఇప్పుడు చేస్తున్న సినిమాల డేట్స్‌కు క్లాష్ వస్తుంది. దీంతో సినిమా నుంచి చైతన్య డ్రాప్ అయిపోయాడని టాక్. దీంతో నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ మరో హీరోను వెతుక్కునే పనిలో ఉంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments