షర్టు లేకుండా చైతు యాక్షన్ సీన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సవ్యసాచి'. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తమిళ నటుడు మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సిస్టర్ సెంటిమెంట్ యాక్షన్ ఫిల్మ్.. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అతి త్వరలోనే మిగిలిన ప్యాచ్ వర్క్‌తో పాటు ఐటమ్ సాంగ్‌ను కూడా పూర్తి చేయనున్నట్టు చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో చైతుని షర్టు లేకుండా దర్శకుడు చూపించారనీ.. ఈ యాక్షన్ సీన్ చాలా బాగా వచ్చిందని సమాచారం. ఈ సీన్‌లో షర్టు లేకుండా నటిస్తే బాగుంటుందని డైరెక్టర్ చెప్పిన వెంటనే.. చైతు కూడా సీన్ కోసం ఒప్పుకోవడం విశేషమని అంటున్నారు.
కాగా.. ఆగష్టులో విడుదల కాబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్‌ను జూలై నెలలో నిర్వహించడానికి నిర్మాణ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com