తమిళ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు..

  • IndiaGlitz, [Wednesday,June 29 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. జులైలో సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ఆగ‌ష్టులో ప్రేమ‌మ్ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత చైత‌న్య సోగ్గాడే చిన్ని నాయ‌నా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం త‌ర్వాత చైత‌న్య త‌మిళ చిత్రం మెట్రో రీమేక్ లో న‌టించ‌నున్న‌ట్టు చెన్నై స‌మాచారం. యాక్ష‌న్ ప్ర‌ధానంగా రూపొందిన మెట్రో లో న‌టించిన శిరీష్ తెలుగు రీమేక్ లో కూడా న‌టిస్తార‌ని తెలుస్తుంది. త‌మిళ మెట్రో చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్ కృష్ణ‌న్ తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే.... త‌డాఖా, ప్రేమ‌మ్ త‌ర్వాత నాగ చైత‌న్య చేస్తున్న మూడ‌వ రీమేక్ చిత్రం అవుతుంది. త్వ‌ర‌లో ఈ చిత్రం గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ వ‌స్తుందేమో చూడాలి.

More News

ఖైదీగా చిరు నెంబర్ నాడు 786..నేడు..?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

101వ చిత్రాన్ని ప్రకటించిన బాలయ్య.....

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు.

రజనీకాంత్ - జాకీచాన్ కాంబినేషన్ లో మూవీ..

రజనీకాంత్ అంటే స్టైల్...జాకీచాన్ అంటే యాక్షన్...అందుకనే స్టైల్ లో కింగ్ రజనీ..యాక్షన్ లో కింగ్ జాకీచాన్ అంటుంటారు.

ఒక మనసు డైరెక్టర్ నెక్ట్స్ మాస్ చిత్రం

మల్లెలతీరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే అభిరుచిగల దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న దర్శకుడు రామరాజు.

టాలీవుడ్ & కోలీవుడ్ క్వీన్..

బాలీవుడ్ లో కంగనా నటించిన క్వీన్ చిత్రం విజయం సాధించిన విషయం తెలిసిందే.