3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ అక్టోబర్ 7న రిలీజ్ అవుతుంది. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతన్య ఓ చిత్రం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు చైతన్య సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కృష్ణ తెరకెక్కించనున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఓ సినిమా చేసేందుకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments