3వ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన చైతు..!

  • IndiaGlitz, [Saturday,September 17 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ అక్టోబ‌ర్ 7న రిలీజ్ అవుతుంది. సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...సోగ్గాడే చిన్ని నాయ‌నా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య ఓ చిత్రం చేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు చైత‌న్య సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై రూపొందే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు కృష్ణ తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల‌తో పాటు డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తో ఓ సినిమా చేసేందుకు చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More News

గోపీచంద్ సినిమాలో ఎన్టీఆర్ విలన్...

ఎన్టీఆర్ కెరీర్‌లో పెద్ద హిట్ మూవీగా నిలిచిన జ‌న‌తాగ్యారేజ్‌లో విల‌న్ గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు స‌చిన్ కేడ్‌క‌ర్ గ‌తంలో త‌మిళంలో సినిమాలు చేసినా జ‌న‌తాగ్యారేజ్ మాత్రం తెలుగులో తొలి చిత్రంగా ఎంట్రీ ఇచ్చాడు.

వ‌రుణ్‌తేజ్‌తో విజ‌య్‌కుమార్ కొండా

`గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` సూప‌ర్‌హిట్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ కొండా నెక్ట్స్ నాగ‌చైత‌న్య‌తో `ఒక లైలా కోసం` అనే ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాడు. ఈ రెండు సినిమాలు త‌ర్వాత విజ‌య్‌కుమార్ కొండా గ్యాప్ తీసుకున్నాడు.

విడాకులు తీసుకుంటున్న సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌...

సూప‌ర్ స్టార్ త‌న‌య సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ 2010లో అశ్విన్‌కుమార్ అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ వీరి మ‌ధ్య విబేదాలు త‌లెత్తాయి.

ఆయ‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ రావాలి - నాగ్

కింగ్ నాగార్జున నేష‌న‌ల్ అవార్డ్ రావాలి అని కోరుకుంటుంది ఎవ‌రికి అనుకుంటున్నారా...? విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కాష్ రాజ్ తాజాగా మ‌న ఊరి రామాయ‌ణం చిత్రాన్ని తెర‌కెక్కించారు.

కింగ్ నాగార్జున చేతుల మీదుగా మ‌న ఊరి రామాయ‌ణం ఆడియో విడుద‌ల‌

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన‌ ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.