ప్రత్యేక పూజలు పై క్లారిటి ఇచ్చిన చైతు..!

  • IndiaGlitz, [Saturday,October 01 2016]

ఇటీవ‌ల నాగార్జున స‌మ‌క్షంలో చైత‌న్య‌, స‌మంత క‌లిసి పూజ చేస్తున్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో స‌మంత మతం మార్చ‌కుంది అని కొంత మంది...కాదు కాదు దోషం పోవ‌డం కోసం రాహుకేతు పూజ‌లు చేసారు అని కొంత మంది అన్నారు. మ‌రి కొంత మంది అయితే...అవి చైతు, స‌మంత నిశ్చితార్ధంకు సంబంధించిన ఫోటోలు అన్నారు. ప్ర‌చారంలో ఉన్న ఈ విషయాల పై ఫ‌స్ట్ టైమ్ నాగ చైత‌న్య ఓ ఇంట‌ర్ వ్యూలో క్లారిటి ఇచ్చాడు.
ఇంత‌కీ నాగ చైత‌న్య ఏం చెప్పాడంటే...మా స్టూడియోలోనే నాన్న గారు పూజ చేసుకుంటుంటే స‌మంత‌, నేను వెళ్లాం. ఆ టైమ్ లో మ‌మ్మ‌ల్ని పూజ‌లో కూర్చొమంటే కూర్చున్నాం. అంతే కానీ...అంద‌రూ అనుకుంటున్న‌ట్టు నిశ్చితార్ధం జ‌ర‌గ‌లేదు. మ‌తం మార్చుకోవ‌డం అంత క‌న్నా కాదు. నాకు స‌ర్వ‌మ‌తాలు స‌మ్మ‌త‌మే. నేను ఒక వ్య‌క్తిని ప్రేమించిన‌ప్పుడు ఆ వ్య‌క్తి ఇష్టాల‌ను కూడా ప్రేమిస్తాను గౌర‌విస్తాను. మ‌తం మార్చుకోమ‌ని చెప్ప‌ను. నాకు మ‌నిషి ముఖ్యం అంటూ క్లారిటి ఇచ్చేసాడు చైతు. అది అస‌లు సంగ‌తి..!