నాగ‌ చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొచ్చింది

  • IndiaGlitz, [Friday,May 11 2018]

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' చిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్ని చోట్ల విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో.. త‌న తాత అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో సంద‌డి చేశారు యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. అతిథి పాత్రే అయిన‌ప్ప‌టికీ. ఈ సినిమా విజ‌యంలో త‌ను కూడా భాగ‌స్వామ్యం వ‌హించారు.

త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. నాగ‌చైత‌న్య‌కి క‌లిసొచ్చిన నెల‌లో విడుద‌లైన ఈ సినిమా ఆ సెంటిమెంట్‌ను మ‌రోసారి రిపీట్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు 100%ల‌వ్ (2011), త‌డాఖా (2013), మ‌నం (2014), రారండోయ్ వేడుక చూద్దాం (2017) చిత్రాల‌తో.. మే నెల‌లో విడుద‌లైన ప్ర‌తి సినిమాతోనూ విజ‌యాన్ని అందుకున్న చైత‌న్య‌.. అతిథి పాత్ర‌లో న‌టించిన మ‌హాన‌టితోనూ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకుని.. మే నెల సెంటిమెంట్‌ను మ‌రోసారి కొన‌సాగించారు.

More News

జూన్ 15న వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,  గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం 'దివ్య మణి'. ప్రముఖ యోగా గురు

ఎవెంజ‌ర్స్ ని గుర్తుచేసే 'సంజీవిని' టీజ‌ర్ విడుద‌ల‌

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే

నాలుగేళ్ళ త‌రువాత బాల‌య్య‌తో..

రెండుత‌రాల‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ విజ‌యాలు అందుకున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.

ఫిదా విడుద‌లైన రోజునే..

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా..

'నేల టిక్కెట్టు' ఆడియో విడుద‌ల‌

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు.