నాగచైతన్య.. ఐదో సారి
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరికి కొన్ని నెలలు భలేగా కలిసొస్తాయి. అలా యువ కథానాయకుడు నాగచైతన్యకి కూడా ఓ నెల బాగా అచ్చొచ్చిందనే చెప్పాలి. ఆ నెలే.. మే నెల. మే నెలలో ఇప్పటివరకు నాలుగు సార్లు నాగచైతన్య సినిమాలు సందడి చేయగా.. అన్ని సందర్భాల్లోనూ విజయాలే దక్కాయి. 2011 వేసవిలో వచ్చిన 100% లవ్‌తో మొదలైన ఈ సెంటిమెంట్..
ఆ తరువాత 2013లో వచ్చిన తడాఖా, 2014లో వచ్చిన మనం చిత్రాలతోనూ కొనసాగింది. అంతేగాకుండా, గతేడాది వేసవిలో విడుదలై విజయం సాధించిన రారండోయ్ వేడుక చూద్దాం కూడా.. మే నెలలో విడుదలైన సినిమానే. ఇలా నాలుగు సార్లు కలిసొచ్చిన మే నెలలో ఐదోసారి సందడి చేసేందుకు ఈ యువ కథానాయకుడు సిద్ధమవుతున్నాడు. ఇంతకీ ఆ చిత్రమేమిటంటే.. సవ్యసాచి. ప్రేమమ్ వంటి సూపర్ హిట్ తరువాత చందు మొండేటి దర్శకత్వంలో చైతన్య నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మే 24న సందడి చేయనుంది. మరి.. మే నెలలో వచ్చిన గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com