స‌మంత బాట‌లో న‌డుస్తున్న చైతూ

  • IndiaGlitz, [Monday,April 15 2019]

స‌మంత బాట‌లో న‌డ‌వ‌డానికి చైతూ సిద్ధ‌మ‌య్యారు. కెరీర్లో కాస్త నిల‌దొక్కుకున్న త‌ర్వాత స‌మంత త‌ర‌హా బోల్డ్ పాత్ర‌ల్లో న‌టించాల‌న్న‌ది ఆయ‌న డ్రీమ్ అట‌. ఇటీవ‌ల 'సూప‌ర్ డీల‌క్స్' లో స‌మంత ఎంపిక చేసుకున్న పాత్ర విని ప్ర‌స్తుతం విస్తుపోయినా, త‌ర్వాత గో ఎహెడ్ అని అన్నార‌ట‌. భ‌విష్య‌త్తులో తాను కూడా అలాంటి ఎక్స్ పెరిమెంట‌ల్ చిత్రాల‌ను చేయాల‌ని అనుకుంటున్నార‌ట చైతూ.

పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించిన 'మ‌జిలీ' ఇప్పుడు 50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. అందుకే ఈ సినిమా గ్రాండ్ స‌క్సెస్ మీట్‌ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.21కోట్లు కావ‌డ‌మే పెద్ద ప్ల‌స్ అయింది.

దానికి తోడు ఫ‌స్ట్ డే హిట్ టాక్ కూడా రూ.50కోట్ల క్ల‌బ్ లో చేర‌డానికి దోహ‌ద‌ప‌డింది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌కు రెండో సినిమా ఆటంకాన్ని దాటిన‌ట్ట‌యింది. సినిమా పెద్ద హిట్ కావ‌డంతో నిర్వాణ సంస్థ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది చాలా ఆనందంగా ఉన్నార‌ట‌. చైతూతో వెంట‌నే మ‌రో సినిమా చేయాల‌న్నంత ఉత్సాహంగా ఉంద‌ని ఫ్రెండ్స్ తో చెబుతున్నార‌ట‌. అన్నీ కుదిరితే త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌ను మ‌రోసారి చూడొచ్చేమో మ‌రి.

More News

'వ్యూహం' అప్డేట్స్

నాని, సుధీర్‌బాబు క‌లిసి న‌టించ‌నున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'వ్యూహం'. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అటు నాని

జ్యోతిక‌కు కార్తీ ఏమ‌వుతాడు

జ్యోతిక‌కు కార్తీ ఏమ‌వుతాడు...  మ‌రిది అవుతాడు. భ‌ర్త సూర్య‌కు స్వ‌యానా త‌మ్ముడు మ‌రిదే క‌దా అవుతాడు. కానీ త‌మ్ముడు అవుతాడు అని అంటున్నారు జీతు జోసెఫ్‌. మ‌ల‌యాళంలో 'దృశ్యం'

మరోసారి తెరపైకి ‘డేటాచోరీ కేసు’.. ఇదే నిజమైతే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘డేటాచోరీ కేసు’ ఎన్నికల అనంతరం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

'చిత్ర‌ల‌హ‌రి' ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం - మెగాస్టార్ చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'.

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం తీవ్ర అసంతృప్తి

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు.. ఈసీపై కన్నెర్రజేసింది.