చైతు మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలో చైతన్య సరసన మంజిమ మోహన్ హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు. తెలుగు లో చైతన్య హీరోగా నటిస్తుంటే..తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నారు.
తమిళ్ లో ఈ సినిమాకి సంబంధించిన తల్లి పోగాదే అనే పాటను ఇటీవల రిలీజ్ చేసారు. ఈ పాట అక్కడ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 31న ఈ పాటను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com