చైతు సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రం `శైలజారెడ్డి అల్లుడు`. `మహానుభావుడు` వంటి ఘనవిజయం తరువాత మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తుండగా... అను ఇమ్మాన్యుయేల్ చైతన్య జోడిగా, రమ్యకృష్ణ కూతురిగా నటించింది. ప్రస్తుతం సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంది.
కేరళలోని తిరువనంతపురంలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే.. భారీ వర్షాల కారణంగా రీ రికార్డింగ్ ఆలస్యమైయ్యేలా ఉందని.. అందువల్ల అనుకున్నట్లుగా సినిమా ఆగస్ట్ 31ప విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఇక ఈ వార్తలు నిజమైతే సెప్టెంబర్ ప్రథమార్థంలో సినిమా విడుదల చేసుకుంటారు. అయితే ఈ విషయంపై యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments